మోహన్ లాల్.. సగం మనిషి.. సగం మృగం..!
Saturday, July 29, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సగం మనిషి.. సగం మృగంగా మోహన్‌లాల్ నటిస్తున్న సినిమా `ఒడియాన్`. డార్క్ నెస్ మిథికల్ కింగ్ మణిక్కన్‌గా మోహన్‌లాల్ నటిస్తున్నారు. సగం మనిషి, సగం మృగం కలిసిన డార్క్ మేజిక్ క్రియేచర్గానూ ఆయన ఇందులో కనిపించనున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇదే.
దర్శకుడు శ్రీకుమార్ మాట్లాడుతూ `` ఒడియన్ సినిమా చరిత్ర, జానపదం కలగలిసిన ఓ వింత సబ్జెక్ట్. తల్లి కడుపులోని బిడ్డను కూడా ఆమెకు తెలియకుండా మాయం చేయగల బ్లాక్ మెజీషియన్ కథ ఇందులో ఉంటుంది. మోహన్ లాల్ ఈ సినిమా కోసం బరువు తగ్గారు. 1950 నుంచి 2000 మధ్య జరిగిన కథను ఇందులో ఆసక్తికరంగా చూపిస్తాం`` అని అన్నారు. మలయాళంలో రూపొందుతున్న మోహన్‌లాల్ సినిమాలన్నీ ఈ మధ్య తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఆ క్రమంలో ఈ సినిమా కూడా మలయాళం నుంచి తెలుగుకు వస్తుందేమో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments