ప్రధాని పాత్రలో మోహన్‌లాల్...
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్ స్టార్ మరోసారి విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంతకు ఆ పాత్ర ఏంటో అనుకుంటున్నారా! దేశ ప్రధాని పాత్ర. ప్రస్తుతం సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
కాగా లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో మోహన్‌లాల్.. చంద్రగాంధ్ వర్మ అనే ప్రధాని పాత్రలో నటిస్తుంటే ఆయన బాడీ గార్డ్ పాత్రలో సూర్య నటిస్తున్నారు. సయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తుంది. వచ్చే ఏడాదికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల తర్వాత సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments