మోహన్ మీడియా క్రియేషన్స్ లో లవ్ 20-20

  • IndiaGlitz, [Friday,February 01 2019]

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్ గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈచిత్రం బెంగుళూర్, నాగర్హోలే నేషనల్ పార్క్, కూర్గ్, కుషాల్ నగర్, ఊటీ, ఇడుక్కి (కేరళ) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని... ఫిబ్రవరి 1 నుండి 6 వ తేదీ వరకు నవి ముంబై లోని ముఖ్యప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ తో పాటుగా ఫైనల్ సాంగ్ మరియు షూటింగ్ కూడా పూర్తిచేసుకోనుంది.

ఈ చిత్రం సెంథిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ప్రత్యేకంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ 20-20 అనే టైటిల్ ఖరారు చేశారు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, రచన, దర్శకత్వం: వి.ఎస్.

More News

చిగురుపాటిని చంపిందెవరు.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.

అదే క‌థ‌తో త‌రుణ్ వెబ్ సిరీస్‌...

తొలి చిత్రం `పెళ్ళిచూపులు`తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు.. నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్.

హాలీవుడ్ చిత్రంలో రాహుల్ రామ‌కృష్ణ‌

అర్జున్ రెడ్డితో న‌టుడిగా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల్లో ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ రామ‌కృష్ణ‌.

సినిమా రంగానికి సింగిల్‌ విండో అనుమతులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు.

బాడీ బిల్డింగ్ చేస్తున్న మెగా హీరో...

2018లో 'విజేత‌' చిత్రంతో హీరోగా ఎంట్రీ  ఇచ్చిన చిరు రెండో అల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌... ఇప్పుడు రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.