మోహనకృష్ణ ఇంద్రగంటి 'తారలు దిగి వచ్చిన వేళ'
Send us your feedback to audioarticles@vaarta.com
సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన `సమ్మోహనం` చిత్రం క్లైమాక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తనికెళ్ల భరణి `తారలు దిగి వచ్చిన వేళ` అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. బుజ్జి కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి `తారలు దిగి వచ్చిన వేళ` పుస్తకం కాన్సెప్ట్ బావుందని పలువురు మెచ్చుకుంటున్నారు.
ఆ పుస్తకం కాపీ కావాలని ఇంకొందరు చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిని అడిగారు. దాంతో మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ విషయాన్ని ఆలోచించారు. క్లైమాక్స్ లో చూపించిన పుస్తకాన్ని ప్రచురించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణికి ఓ ప్రచురణ సంస్థ ఉంటుంది... `అనగనగా` అని. అదే పేరుతో మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఓ ప్రచురణ సంస్థను మొదలుపెట్టి తొలి ప్రచురణగా `తారలు దిగి వచ్చిన వేళ`ను ప్రచురించారు. ఆ మధ్య ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తాజాగా ఈ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ తనయ సితార అందుకున్నారు.
ఈ పుస్తకం గురించి మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ `` తారలు దిగివచ్చిన వేళ... `` `సమ్మోహనం` చిత్ర పతాక సన్నివేశాలు ఎలా ఉండాలా? అని మథనపడుతుండగా వచ్చిన ఆలోచన. సినిమా రంగం పట్ల చిన్నచూపు ఉన్న చిత్రకారుడు, అనుకోకుండా ఆ రంగానికే చెందిన ఒక నటిని ముందు గాఢంగా ప్రేమించి, తరువాత అనాలోచితంగా ద్వేషించి, చివరికి తన పొరపాటు గ్రహించి ఆ అమ్మాయిని తిరిగి పొందే క్రమంలో ఆ అనుభవసారాన్ని ఒక చిన్నపిల్లల కథలా రాస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనకి రూపమే ఈ పుస్తకం. ఓ పక్క ఒక ఊహాజనిత అనుభవానికి అక్షర, చిత్ర రూపం ఇస్తూనే, అంతర్లీనంగా తన వ్యక్తిగత ప్రేమానుభవాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తాడు ఈ చిత్ర కథానాయకుడు.
ఈ కథని తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు చారి పి.యస్.గారు వేసిన అద్భుతమైన బొమ్మలు `సమ్మోహనం` చిత్ర పతాక సన్నివేశంలోని నటన, గతి, సంగీతం, కళా దర్శకత్వం, ఛాయాగ్రహణాలకి దిశానిర్దేశం చేశాయి. ఈ కథ, బొమ్మలూ చిన్న పిల్లలకీ, పెద్దలకీ బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com