అయోధ్య తీర్పుపై మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలివీ...

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఇవాళ తుదితీర్పులో సుప్రీం తేల్చేసింది. ఈ తీర్పుపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. అయోధ్యపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

అది నిజం కాదు..!

‘రామమందిరం నిర్మాణానికి అందరం చేయిచేయి కలిపి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్‌కు భూమి అప్పగించడం, ఆలయ నిర్మాణం అన్నీ జరుగుతాయి. ఇలాగే జరగాలని మేము నిర్దేశించడం లేదు. వివాదం సమసిపోయిందని భావిస్తున్నాం. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనేది సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రం చూసుకుంటుంది. మందిరం నిర్మాణమే మా లక్ష్యం. సంఘ్‌ ఎప్పుడూ ఆందోళనలు చేస్తుందని ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నించారు...అది నిజం కాదు’ అని మోహన్‌ భగవత్‌ చెప్పుకొచ్చారు.

More News

'భీష్మ' తొలి వీడియో దృశ్యాలకు మంచి స్పందన

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.

సుప్రీం చరిత్రాత్మక తీర్పు.. రాముడిదే అయోధ్య

న్యూ ఢిల్లీ: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి శనివారంతో సుప్రీంకోర్టు ముగింపు ఇచ్చేసింది.

కుర్ర హీరోలకు షాకిస్తున్న మెగాస్టార్

హీరోలు ఫిట్‌నెస్ కోసం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతుంటారు. గంట‌ల పాటు హీరో, హీరోయిన్స్ జిమ్‌లో ఎక్స‌ర‌జ్ సైజులు చేస్తుంటారు.

సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో 'హేజా`..డిసెంబ‌ర్ విడుద‌ల‌

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం "హేజా".  (ఎ మ్యూజికల్ హారర్).

'నమస్తే నేస్తమా' తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది - పాపులర్‌ ఫిలింమేకర్‌ కె.సి.బొకాడియా

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి,