నన్ను వాడుకొని వదిలేశారు, ఎన్నో సార్లు మోసపోయా : మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

  • IndiaGlitz, [Sunday,March 20 2022]

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని.. కానీ తనను మాత్రం అంతా వాడుకుని వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో మార్చి 19న మోహన్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందరి చేతుల్లో ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని మోహన్ బాబు చెప్పారు. ఏడేళ్ల పాటు తిండిలేక, రెండు జతల బట్టలతో కారు షెడ్‌లో గడిపానని ఆయన తెలిపారు.

అసలు జీవితమంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. తనతో కొందరు రాజకీయనాయకులు ప్రచారం చేయించుకున్నారని.. తనకు మాత్రం ఎవరూ ఏదీ చేయలేదని ఆయన ఆరోపించారు. తను కూడా వాళ్ల సాయం కోరనని మోహన్ బాబు తేల్చిచెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని ఆయన గుర్తుచేశారు.

తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మోహన్ బాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ తాజా కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించినవా.. లేదంటే వైసీపీని టార్గెట్ చేశారా అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

More News

ఊర మాస్ లుక్‌లో నేచురల్ స్టార్ .. అంచనాలు పెంచేస్తోన్న ‘దసరా’ పోస్టర్

ఫ్యామిలీ, లవ్, కామెడీ సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన నేచురల్ స్టార్ నానీ..

మా కోసం ఆయన తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు.. చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద : రాజమౌళి వ్యాఖ్యలు

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ..

జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కారులో ఎమ్మెల్యే కుమారుడు, ధ్రువీకరించిన పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం వ్యవస్థాపక సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు.

తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్ ’ టికెట్ ధరల పెంపు.. ఏంతంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్‌చరణ్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీకి తెలంగాణ  సర్కార్ శుభవార్త చెప్పింది.