మోహన్ బాబు దర్శకత్వం చేస్తున్నాడా..?
Saturday, June 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
600పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించిన మోహన్‌బాబు త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో విష్ణు హీరోగా నటిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. ఎప్పటి నుండో విష్ణు టైటిల్ పాత్రలో `కన్నప్ప` సినిమా రూపొందనుందని వార్తలు వినపడుతూ వచ్చాయి. ఒకనొక సందర్భంలో తనికెళ్ళభరణి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని మోహన్‌బాబు డైరెక్ట్ చేస్తాడని ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.
2018 ప్రథమార్థంలో సినిమా సెట్స్‌లోకి వెళుతుందని టాక్. వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాను విడుదల కూడా చేస్తారట. ఓ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ద్వారా మెగాఫోన్ పడితే బావుంటుందని మోహన్‌బాబు వర్గం ఆలోచిస్తుందట. అయితే దీనిపై మోహన్‌బాబు కానీ, విష్ణు కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఒకవేళ వారి నుండి ఏ స్పందన లేదంటే..మౌనం అర్ధంగీకారమేనన్నట్లు అవుతుంది మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments