చంద్రబాబుపై మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలగపోతే సహించేది లేదని పార్టీ నాయకులను హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆయన.. తనకు సన్నిహితుడైన మోహన్ బాబునే సస్పెండ్ చేశానని ఈ సందర్భంగా ఉదహరించి మరీ తెలుగు తమ్ముళ్లకు గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్పందించిన మోహన్ బాబు.. ట్విట్టర్ వేదికగా స్పందించి.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నా మనసును గాయపరిచావ్!
‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి.. ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుంచి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.. చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే’ అని బాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే!
‘క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’ అని ట్విట్టర్ వేదికగా బాబుపై మంచు మోహన్ బాబు ఒకింత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే మంచు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు.. ముఖ్యంగా నారా చంద్రబాబు, లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout