మోహన్ బాబుకు సడన్ షాక్.. ఏడాది జైలు శిక్ష
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఇటీవల వైసీపీలో చేరిన మంచు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది. రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్ట్‌కు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.
అసలేం జరిగింది..!?
లక్ష్మీ పిక్చర్స్ ఆధ్వర్యంలో 2010లో మంచు విష్ణు హీరోగా.. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీమ్’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో ‘సలీమ్’ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్ట లేదు. దీంతో చెక్ ద్వారా మోహన్ బాబు వైవిఎస్ చౌదరికి డైరెక్షన్ డబ్బులు చెల్లించారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యాయి. సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ డబ్బులు ఇవ్వడంలో మోహన్ బాబు ఇబ్బందులు పడ్డారు. అదే ఏడాది చౌదరి కోర్టును ఆశ్రయించారు. నాటి నుంచి పలుమార్లు ఈ కేసును విచారించిన కోర్టు మంగళవారం నాడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.
బెయిల్ పిటిషన్ దాఖలు..
ఇదిలా ఉంటే కోర్టు ఇచ్చిన తీర్పుతో మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం తీర్పువచ్చిన తర్వాత మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్‌కోసం పిటిషన్ వేశారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఈ వ్యవహారంపై మోహన్ బాబు మీడియా ముందుకు రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout