చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల్లో అయినా.. సినీ ఇండస్ట్రీ పరంగా అయినా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసే వ్యక్తి నటుడు మంచు మోహన్‌బాబు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకొచ్చి రాజకీయ నేతల గురించి ఈయన మాట్లాడిన మాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన నేతల గురించి మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. శనివారం నాడు తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.
మోహన్ బాబు మాటల్లోనే..
"ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల విషయంలో సీఎం చంద్రబాబు చొరవ చూపడం లేదు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి తమ సంస్థ విద్యార్థుల ఫీజులు ఇవ్వలేదు.. అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారు. చంద్రబాబు నాకెంతో సన్నిహితుడు.. ఒకప్పుడు మా విద్యానికేతన్, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయాను. విద్యాభివృద్ధికి మా వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టుకోలేకపోయారు. ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు’ అమలు కాని హామీలు, మాటలు ఎందుకు?" అని సీఎంపై మోహన్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమలు కాని హామీలెందుకు బాబు..!?
"విద్యాభివృద్ధికి ఏపీ సర్కారు సరిగా పనిచేయడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని సాక్షాత్తు చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదు. నేను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదు. తక్షణం మా ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి కోరుతున్నాను. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి.. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు?" అని చంద్రబాబును మోహన్ బాబు ప్రశ్నించారు. కాగా ఇప్పటికే పలుమార్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ మోహన్‌బాబు మాట్లాడారు కానీ ఆయన సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. అయితే ఈ సారైనా చంద్రబాబు స్పందిస్తారా లేకుంటే మిన్నకుండిపోతారో..? వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments