అంతా అబద్ధమే.. కోర్టులోనే తేల్చుకుంటాం..: మోహన్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కలెక్షన్ కింగ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. "2009లో 'సలీమ్' సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40లక్షల చెక్ ఇచ్చాం. 'సలీమ్' అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం.
సినిమా చేయడం లేదని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి.. కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
నేను ఇంట్లోనే ఉన్నా..
తనకు ఏడాది జైలు శిక్ష విధించారని.. జైలుకెళ్లానని వస్తున్న వార్తలన్నీ అబద్ధమేనని.. తాను ఇంట్లోనే ఉన్నానని ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టం చేశారు.
30రోజులు గడువిచ్చిన కోర్టు..
ఇదిలా ఉంటే బెయిల్ పిటిషన్‌కు మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు ఏడాదికిగాను బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. 30 రోజుల్లో బౌన్స్ అయిన నగదును దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. నెలరోజుల లోపు చౌదరికి ఇవ్వాల్సిన రూ. 48 లక్షలు చెల్లించేస్తే ఈ కేసు కొట్టేస్తారు.
దీంతో అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోహన్ మాత్రం స్పెషల్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉంది. మున్ముంథు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments