నిర్మాత అనే పదానికి, బాధ్యతకి నిర్వచనం కె.రాఘవ గారు - మోహన్ బాబు

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

ప్రఖ్యాత నిర్మాత కె.రాఘవ గారి హఠాన్మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన నిర్మాణంలో తూర్పు పడమర అనే చిత్రంలో నటించిన నాకు, రాఘవ గారితో విశేషమైన అనుబంధం ఉంది.

నిర్మాత అనే పదానికి నిర్వచనంలా వ్యవహరించే ఆయన నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.

ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శిరిడి సాయినాధుని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాను.