'మా ' ఎన్నికలు అవ్వగానే.. నీ క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇస్తా: పవన్‌కు క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల మూసివేత, ఆన్‌లైన్ టికెట్లు అమ్మే అంశాలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మోహన్ బాబుకి పవర్ స్టార్ క్లాస్ పీకారు. ఏపీలో చిత్రపరిశ్రమకు జరుగుతున్న అంశాలపై మోహన్ బాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కుటుంబీకులు మీకు బంధువులు కదా.. చిత్ర పరిశ్రమను హింసించొద్దని వాళ్లకి చెప్పాలని పవన్ విజ్ఞప్తి చేశారు. కావాలంటే పవన్ కళ్యాణ్‌ను బ్యాన్ చేసుకోమనండి.. కానీ చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు విన్నవించాలని పవర్ స్టార్ కోరారు. ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాకపుట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. ‘‘ తన చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించానని.. వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమేనన్న మోహన్ బాబు.. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయని గుర్తుచేశారు. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డ సంగతి నీకు తెలిసిందేనని .. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు ముగుస్తాయని కలెక్షన్ కింగ్ చెప్పారు. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి తాను హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని.. అయితే ఈలోగా నువ్వు నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు ముగించారు. మరి దీనిపై పవర్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments