బావా బాహుబలి పెళ్ళి చేసుకో అంటూ మోహన్ బాబు ట్వీట్....
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ ఎం.మోహన్‌బాబు, బాహుబలి సక్సెస్ పట్ల టీంకు అభినందనలు తెలియజేశాడు.
ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్ర ప్రసాద్' గా సార్థక నామధేయుడివి అయ్యావ్ ... ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను.
ప్రియమైన ఎస్.ఎస్.రాజమౌళి భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య NT రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావ్. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి 'రమ' ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను...
బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ..
కీర్.. మరకతమణిగా.. MM క్రీమ్ గా.. కీరవాణిగా.. ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడవై పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ...
ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు.. దిగ్విజయోస్తు..
నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకోర్చి మీరు బాహుబలి ద్వారా ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నందుకు నాతోపాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. డియర్ శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని అంటూ యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభినందించాడు మోహన్‌బాబు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments