అబ్బే.. చిరు మూవీలో మోహన్ బాబు నటించట్లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడిప్పుడే షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు..? పాత్రధారులెవరు..? అనే విషయాలు మాత్రం అధికారికంగా చెప్పకపోయినప్పటికీ పుకార్లు మాత్రం చాలానే వస్తున్నాయి. అయితే ఇటీవల చిరంజీవితో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు (విలన్) తలపడుతున్నారని పుకారు వచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత అనగా.. 1990లో విడుదలైన ‘కొదమసింహం’ తర్వాత కలిసి నటిస్తున్నారని అటు మంచు ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలారు. కలెక్షన్ పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలువనుందని కూడా వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ఈ సినిమాలో నటించడానికి మోహన్‌బాబు కూడా ఓకే అన్నారని టాక్ నడిచింది. ఇంతవరకూ ఈ వ్యవహారంపై క్లారిటీ రాకపోగా తాజాగా చిత్రబృందం స్పందించి తేల్చేసింది.
క్లారిటీ వచ్చేసింది..!
‘మా సినిమాలో మోహన్ బాబు నటించడం లేదు. ఆయనకు తగిన పాత్ర మా సినిమాలో లేదు. ఒకవేళ అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారం’ అని ఒక్క మాటతో చిత్రబృందం తేల్చేసింది. ఈ సింగిల్ మాటతో అభిమానుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. మోహన్‌బాబు పాత్రపై తేల్చిన చిత్రబృందం రామ్‌చరణ్ నటిస్తాడన్న వార్తపై మాత్రం స్పందించలేదు. అంతేకాదు.. హీరోయిన్ విషయంలోనూ ఎటూ తేల్చలేదు. మరీ ముఖ్యంగా ఇన్ని రోజులు త్రిష నటిస్తోందని వస్తున్న వార్తపై కూడా రియాక్ట్ కాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments