కలెక్షన్ కింగ్ సినిమా డిటెయిల్స్ మరికొన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడిగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రౌడీ` తర్వాత తెరపై కనపడలేదు. తాజాగా త్వరలోనే ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. ఈ సినిమా మరాఠీ సినిమాకి రీమేక్ గా రూపొందనుందట. ఈ చిత్రంలో మోహన్ బాబు, నరేష్ కి పెద్దనాన్నగా కనిపించనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందట. ఆగస్టు 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుందని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments