మాడా మృతి తీరని లోటు - డా.మోహన్ బాబు

  • IndiaGlitz, [Sunday,October 25 2015]

మాడా వెంక‌టేశ్వ‌ర‌రావు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌గా త‌న మార్కు పాత్ర‌ల‌తో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల్లోన‌టించి మెప్పించారు. ఆనారోగ్య కార‌ణంగా ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచిపెట్టి పోవ‌డం చాలా బాధాక‌రం. నాతో పాటు ఎన్నో సినిమాల్లో ప‌నిచేశారు. అలాగే మా సంస్థ‌లో కూడా నాతో క‌లిసి ప‌నిచేశారు. ఆయ‌న మృతి నాకు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.