జగన్‌పై అసంతృప్తి.. బీజేపీలోకి మంచు మోహన్ బాబు!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచుమోహన్ బాబుకు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా..? సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసంతృప్తితో ఆయన వైసీపీకి టాటా చెప్పాలని భావిస్తు్న్నారా..? ఇన్ని రోజులు పార్టీలో ఉన్నప్పటికీ తనను గుర్తించలేదని.. తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని మంచు కుటుంబం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది.
అందుకేనా..!?
2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. సడన్‌గా వైఎస్ జగన్‌ను కలవడం.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయింది. వాస్తవానికి.. వైఎస్ ఫ్యామిలీతో మోహన్ బాబు కుటుంబానికి చాలా మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం.. అప్పట్లో ఆయనకు తిరుపతి లేదా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్.. ఇవన్నీ కుదరకపోతే రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ ఏమీ జరగకపోగా.. కనీసం తనను గుర్తించట్లేదని.. తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని.. తనకంటే జూనియర్స్‌కు పృథ్వీరాజ్‌లాంటి వారికి పదవులిచ్చి తనను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆయన అసంతృప్తితో ఉన్నారట.
సాయంత్రం చేరిక!?
అందుకే.. ఇక పార్టీలో ఉండి కూడా ఏమీ ఫలితం లేదని.. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీలో చేరాలని మోహన్‌బాబును మోదీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన మోహన్ బాబు.. ఇవాళ బీజేపీలో నంబర్-02గా, కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షాను కలిసి ఫైనల్‌గా నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. కాగా.. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు షాను మంచు కుటుంబం కలవనున్నది.
ప్రశంసల వర్షం!
ఇదిలా ఉంటే.. మోదీని కలిసిన అనంతరం మంచు లక్ష్మీ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించింది. ‘ఇప్పుడే డైనమిక్ ప్రధాని మోదీని కలిశాం. మోదీ సారధ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుటుంది’ అని లక్ష్మీ ట్వీట్ చేసింది. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ మంచు కుటుంబం మాత్రం స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. మరి ఈ చేరికపై నిజానిజాలెంతో తెలియాలంటే ఇవాళ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments