కొంపలు కూలుస్తావు కదయ్యా నువ్వు - మోహన్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్‌బాబు మరోసారి స్టేజ్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ కోపానికి ఆయన కారణాన్ని వివరించాడు. గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా జయదేవ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరిలో కొడాలి వెంకటేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించి మాట్లాడుతూ గంటా రవి డేట్స్ నేను చూస్తున్నాను.
ఎందుకంటే ఎప్పుడైనా హీరోకు ఆరోగ్యం సరిగా లేకుంటే ఆయన స్థానంలో గంటాశ్రీనివాసరావుగారువచ్చి నటిస్తారు. ఎందుకంటే ఆయన సెక్స్ సీన్స్ బాగా చేస్తారని భావిస్తున్నానంటూ చెప్పేశాడు. (అంటే ఇక్కడ రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ అనాల్సింది). దీనిపై మోహన్‌బాబు రియాక్ట్ అయ్యాడు. ఎంటయ్యా వెంకటేశ్వరరావు నువ్వు కొంపలో నిప్పులు పోస్తావు కదయ్యా. కొంపలు కూలుస్తావు కదయ్యా అంటూ తన కోపాన్ని స్టేజ్‌పై ప్రదర్శించాడు. గంటా శ్రీనివాసరావు ప్రజలకు మంచి చేస్తాడు కాబట్టే అతను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని సెక్స్ సీన్స్ బాగా చేస్తాననడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా..అతని భార్య వింటుంది కదా..ఆమె ఎమనుకుంటుంది అన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com