మలయాళ రీమేక్‌లో కలెక్షన్‌ కింగ్‌

  • IndiaGlitz, [Wednesday,October 21 2020]

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్‌గానే సినిమాలను యాక్సెప్ట్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఓ మలయాళీ రీమేక్‌లో మోహన్‌బాబు నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు మలయాళంలో రతీష్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని అందుకున్న సైన్స్‌ ఫిక్షన్‌ కామెడి డ్రామా 'అండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25' రీమేక్‌లో మోహన్‌బాబు నటించబోతున్నారట. మరి దీనిపై మంచు క్యాంప్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా.. ఈ మధ్య మోహన్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా డైమండ్‌ రత్నం దర్శకత్వంలో సన్నాఫ్‌ ఇండియా సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 560కు పైగా సినిమాల్లో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మోహ‌న్‌బాబు మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా నిర్మాత‌గా కూడా 50 చిత్రాల‌ను నిర్మించారు. కొంత‌కాలంగా ఆయ‌నకు ఎగ్జ‌యిట్‌మెంట్‌గా అనిపించిన స్క్రిప్ట్స్‌కే ఓకే చెబుతున్నారు.సూర్య హీరోగా సుధాకొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఆకాశం నీ హ‌ద్దురా చిత్రంలో మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.