'మహానటి' కోసం పారితోషికం తీసుకోని మోహన్‌బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'మహానటి'. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథను వెండి తెరపై ఆవిష్కరించనున్న బయోపిక్ ఇది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. మిగిలిన కీలకపాత్రల్లో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు నటించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన మోహన్ బాబుకు సంబంధించిన విషయమొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆ పాత్రలో నటించేందుకు మోహన్ బాబు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. తన కోసం అయ్యే ఖర్చులను కూడా తానే భరించారట.
మోహన్ బాబు అడిగితే కోటి రూపాయల వరకు ఇవ్వడానికి సిద్దపడ్డారట నిర్మాత అశ్వనీదత్. కాని "ఎస్.వి.రంగారావు పాత్రలో నటించడమే ఒక గౌరవం. అది వెలకట్టలేని పాత్ర" అంటూ ఎస్.వి.ఆర్.పై తనకున్న ప్రేమని, గౌరవాన్ని చాటుకున్నారు కళాప్రపూర్ణ. త్వరలో మోహన్ బాబు పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనుంది చిత్ర బృందం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com