గవర్నర్లు, సీఎంలు మా ఇంటికి వస్తారు.. పేర్ని నాని కూడా అలానే, దాన్ని తప్పుబడతారా: మోహన్‌బాబు ఆగ్రహం

  • IndiaGlitz, [Monday,February 14 2022]

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం అమరావతి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే భేటీ ముగిసిన మరుసటి రోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని.. స్వయంగా హైదరాబాద్ వెళ్లి మోహన్‌బాబుతో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను, చిరంజీవి బృందంతో జరిపిన చర్చల వివరాలను మోహన్ బాబుకు వివరించేందుకే నాని అక్కడికి వెళ్లారంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడం, మంచు విష్ణు తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయడం, సాయంత్రానికి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం చకచకా జరిగింది. అయినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగలేదు.

ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఈ వ్యవహారంపై స్పందించారు. ఆయన ఇటీవల నటించిన ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు అనేక అంశాలపై మాట్లాడారు. తన ఇంటికి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా పలువురు ప్రముఖులు అతిథులుగా వస్తుంటారని పెదరాయుడు చెప్పారు. అలాంటి పేర్ని నాని మా ఇంటికి వస్తే రకరకాల వార్తలు వచ్చాయని .. హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వస్తే, బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచానని మోహన్ బాబు పేర్కొన్నారు. జగన్ ఏం అన్నారు..? మా సినిమా వాళ్ల బృందం ఏం మాట్లాడిందని తాను నానిని అడగలేదని, సరదాగా కబుర్లు చెప్పుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

కలెక్షన్ కింగ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించినట్లుగా పోస్టర్లు, గ్లింప్స్ చెబుతున్నాయి. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

More News

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూర్య స్టెప్ , తెలుగు ఫ్యాన్స్ కోసమే.. ఫోటోలు వైరల్

తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వున్న కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు,

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ - నాగు గవర 'నాతిచరామి' ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'.

భారత కార్పోరేట్ రంగంలో విషాదం.. దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జనరిక్‌ మెడికల్‌ షాపులు

ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో స్టేషన్‌లలో జనరికల్ మెడికల్ షాపులను అందుబాటులోకి తెచ్చింది

బాలీవుడ్ ఇక అంతమే.. టాలీవుడ్‌దే ఆ ప్లేస్, ఎప్పుడో చెప్పా: పాయల్ కామెంట్స్ వైరల్

దేశంలో ఇప్పుడు తెలుగు సినిమా ప్రభ వెలుగొందుతోంది. కమర్షియల్ సినిమాలు తప్పించి.. భారీ బడ్జెట్, ప్రయోగాత్మక సినిమాలు తీయలేరంటూ విమర్శలు చేసినవారు