గవర్నర్లు, సీఎంలు మా ఇంటికి వస్తారు.. పేర్ని నాని కూడా అలానే, దాన్ని తప్పుబడతారా: మోహన్‌బాబు ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం అమరావతి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే భేటీ ముగిసిన మరుసటి రోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని.. స్వయంగా హైదరాబాద్ వెళ్లి మోహన్‌బాబుతో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను, చిరంజీవి బృందంతో జరిపిన చర్చల వివరాలను మోహన్ బాబుకు వివరించేందుకే నాని అక్కడికి వెళ్లారంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడం, మంచు విష్ణు తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయడం, సాయంత్రానికి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం చకచకా జరిగింది. అయినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగలేదు.
ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఈ వ్యవహారంపై స్పందించారు. ఆయన ఇటీవల నటించిన ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ ప్రమోషన్లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు అనేక అంశాలపై మాట్లాడారు. తన ఇంటికి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా పలువురు ప్రముఖులు అతిథులుగా వస్తుంటారని పెదరాయుడు చెప్పారు. అలాంటి పేర్ని నాని మా ఇంటికి వస్తే రకరకాల వార్తలు వచ్చాయని .. హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వస్తే, బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచానని మోహన్ బాబు పేర్కొన్నారు. జగన్ ఏం అన్నారు..? మా సినిమా వాళ్ల బృందం ఏం మాట్లాడిందని తాను నానిని అడగలేదని, సరదాగా కబుర్లు చెప్పుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
కలెక్షన్ కింగ్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘‘సన్ ఆఫ్ ఇండియా’’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్ఫుల్ రోల్ పోషించినట్లుగా పోస్టర్లు, గ్లింప్స్ చెబుతున్నాయి. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments