మోహన్ బాబు 'గాయత్రి' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Monday,December 25 2017]

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ పై ఉన్న కాప్షన్ "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" మరింత ఆసక్తిని రేపుతోంది.

మోహన్ బాబు తన మైలురాయి చిత్రాలైన పెదరాయుడు మరియు రాయలసీమ రామన్న చౌదరి తరహాలో మరో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 'గాయత్రి' చిత్రంలో విష్ణు మంచు కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. విష్ణుకు జోడిగా శ్రియ కనిపించనున్నారు.

నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురిగా టైటిల్ పాత్రలో నటించగా ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

More News

డైరెక్టర్ మారుతి క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన' ఫస్ట్ ర్యాంక్ రాజు' చిత్రం

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్,మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు.

2018.. రామజోగయ్య శాస్త్రికి స్పెషల్

రామజోగయ్య శాస్త్రి..పరిచయం అక్కర్లేని పాటల రచయిత పేరిది.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

రవితేజ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన చిత్రం 'రాజా ది గ్రేట్'.

'పరిచయం' ప్రీ లుక్ విడుదల

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైద్రాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో