పవన్ తో విభేదించిన కలెక్షన్ కింగ్..

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం టిటిడి దేవాల‌య ఈవోగా ఐఎఎస్ సింఘాల్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉత్త‌రాదికి చెందిన ఐఎఎస్‌ను టిటిడి ఈవోగా నియ‌మించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. స్వామి స‌ర‌స్వ‌తి దయానంద ఉత్త‌రాది ఈవో సింఘాల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ విష‌యంపై కోర్టుకు కూడా వెళ‌తామ‌ని స్వామిజీ తెలియ‌జేశారు. అదే రోజున జ‌న‌సేన అధినేత, పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా సింఘాల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఉత్త‌రాది వారికి ద‌క్షిణాది సంస్కృతి గురించి తెలియ‌ద‌ని, ఉత్త‌రాది గుళ్ళ‌కు ద‌క్షిణాది వారిని ఈవోలుగా నియ‌మిస్తారా..
అలాంట‌ప్పుడు సింఘాల్‌ను టిటిడి ఈవోగా ఎలా నియ‌మించారు, దీనిపై చంద్ర‌బాబునాయుడు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నాడు. అయితే ఐఎఎస్‌లు దేశంలో ఎక్క‌డైనా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని, అలాంట‌ప్పుడు సింఘాల్ నియామ‌కంలో త‌ప్పేంట‌ని రాజేంద్ర‌బాబు అనే టిడిపి నాయ‌కుడు ప‌వ‌న్‌ను విమ‌ర్శించాడు. ఇదే విష‌యంపై మోహ‌న్‌బాబు మాట్లాడుతూ హిందువులంద‌రికీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవుడ‌ని, ఆయ‌న్ను ఒక ప్రాంతానికి ప‌రిమితం చేయ‌డం స‌రికాద‌ని, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను తాను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రి దీనిపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.