మ‌రోసారి పాక‌శాస్త్రంలో మోహ‌న్‌బాబు ప్రావీణ్య‌త‌

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించాయి ప్ర‌భుత్వాలు. దీంతో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. షూటింగ్స్ అన్నీ ర‌ద్ద‌యిపోవ‌డంతో ఎప్పుడూ షూటింగ్స్, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండే స్టార్స్ అంద‌రూ ఖాళీగా కుటుంబ స‌భ్యుల‌తో స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ఇంటి ప‌నులు, వంట ప‌న‌లు చేస్తూ బిజీగా ఉండ‌ట‌మే కాకుండా కొత్త కొత్త ప‌నులు నేర్చుకుంటున్నారు. ఒక‌రికొక‌రు డిఫ‌రెంట్ ఛాలెంజ్‌లు విసుర‌కుంటున్నారు. తాజాగా న‌టుడు, నిర్మాత అయిన మోహ‌న్‌బాబు ఇప్పుడు ఓ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

ఇటీవ‌ల సుబ్బ‌రామిరెడ్డి కుమార్తె విసిరిన ఛాలెంజ్‌లో పాల్గొని మ‌సాలా వ‌డ తయారు చేసిన మోహ‌న్‌బాబు ఇప్పుడు మ‌రోసారి పాక‌శాస్త్రంలో త‌న ప్రావీణ్య‌త‌ను నిరూపించుకున్నారు. కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌తో క‌లిసి థాయ్‌, ఇండియ‌న్ ఫ్లేవ‌ర్‌లో ఓ వంట‌కాన్ని త‌యారు చేశారు. మోహ‌న్‌బాబుతో పాటు ఆయ‌న శ్రీమ‌తి నిర్మ‌ల కూడా ఈ రెసిపీని త‌యారు చేయ‌డంలో స‌పోర్ట్ చేశారు. దీనికి ఖీమా స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అని పేరు పెట్టారు. ఈ వీడియోను ల‌క్ష్మీ మంచు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

More News

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే మానిటోరియం, కేంద్రం చేతుల్లోకి కరెంట్, ఎఫ్ఆర్‌బీఎమ్‌, వలస కార్మికుల తరలింపుతో పాటు పలు విషయాల్లో కేంద్రం

టిక్‌టాక్‌లోకి విష్ణు ఎంట్రీ

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా గురించి తెలియ‌నివాడు లేదు. ప్ర‌తి మనిషి జీవితంలో సోష‌ల్ మీడియా ఏదో ర‌కంగా భాగ‌మైంది. ఇక సెల‌బ్రిటీల సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

'కిమ్ చనిపోవడం' అంతా డ్రామానే.. అసలు కారణాలివీ..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఏపీ : పది పరీక్షలపై వదంతులు నమ్మొద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. ప్రస్తుతం 3.0 లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు

సీఎం జగన్ ఉదారత.. ఒక్కో వలస కూలీకి రూ. 500!

వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని, సంకోచించకుండా.. చొరవ తీసుకొని అవసరమైన వారికి సహాయం చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.