నలభై వసంతాల నటప్రపూర్ణుడు

  • IndiaGlitz, [Sunday,November 22 2015]

కొండ‌ల‌లో నెల‌కొన్న కోనేటి రాయుడి పాదాల చెంత, స్వ‌ర్ణ‌ముఖీ న‌దీ తీరాన పుణ్య‌దంపుతులు శ్రీ మంచు నారాయ‌ణ‌స్వామినాయుడు, ల‌క్ష్మ‌మ్మ‌ల గర్భాన విక‌సించిన బ్ర‌హ్మ క‌మ‌ల‌మా..భ‌క్త‌వ‌త్స‌ల నాయుడా..గురుదైవం ద‌ర్శ‌క‌రత్న శ్రీదాస‌రి నారాయ‌ణ‌రావుగారి ఆశీస్సుల‌తో మోహ‌న్‌బాబుగా నామ‌క‌ర‌ణం చేయించుకుని స్వ‌ర్గం-న‌రకం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌..

మా మంచు మోహ‌నా..మీ రూపం చంద్ర బింబం

మోహ‌నా.. మీ ప్రేమ అమోఘం

మోహ‌నా...మీ అప్యాయ‌త ఆద‌ర్శం

మోహ‌నా...మీ కోసం ప్ర‌ళ‌యం

మోహ‌నా...మీ ఆశ‌యం శిఖ‌రం

మోహ‌నా...మీ విన‌యం మేరు ప‌ర్వ‌తం

మోహ‌నా...మీ మన‌స్సు బంగారం

మోహ‌నా...మీ క‌రుణ జ‌ల‌పాతం

మోహ‌నా...మీ ప‌ట్టుద‌ల అమ‌రం

మోహ‌నా...మీ సంస్కారం ఓ వ‌రం

మోహ‌నా...మీ కృషి నిరంతరం

మోహ‌నా...మీ సంక‌ల్పం ఆయుధం

మోహ‌నా...మీ క్ర‌మ‌శిక్ష‌ణ స‌మ్మోహ‌నం

మోహ‌నా...మీ న‌ట‌న విల‌క్ష‌ణం

మోహ‌నా...మీ వాచ‌కం గంభీరం

మోహ‌నా...మీ వ్యాప‌కం కోలాహ‌లం

మోహ‌నా...మీ విద్యాలయం స‌ర‌స్వ‌తి నిల‌యం

మోహ‌నా...మీ రాజ‌కీయం కాక‌తాళీయం

మోహ‌నా...మీ సేవాగుణం అజ‌రామరం

మోహ‌నా...మీ స్నేహం చిర‌స్మ‌ర‌ణీయం

మోహ‌నా...మీ కుటుంబం స్వ‌ర్గ‌ధామం

మా మంచు కిరీట‌మా..మీ న‌ట‌నా చాతుర్యంతో మా మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకుని నేటికి 40 వ‌సంతాలు పూర్తి చేసుకుని న‌టుడిగా 520 చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా 50కి పైగా చిత్రాలను ల‌క్ష్మీప్ర‌స‌న్న ప‌తాకంపై నిర్మించి అరుదైన చ‌రిత్ర సృష్టించి న‌ట‌ప్ర‌పూర్ణ అనే మాట‌కు ప‌రిపూర్ణ‌త‌ను సాధించిన చ‌రిత్ర‌కారా..మీకు మీరే సాటి..

మీ నిర్మ‌ల‌మైన న‌ట‌నా ప్ర‌కాశ‌పు కిర‌ణాల‌ను మ‌రింత‌గా పంచ‌డానికి మంచు ముత్యాల్లాంటి లక్ష్మీప్ర‌సన్న విష్ణు, మ‌న‌జ్ రూపంలో ప్ర‌స‌రింప‌జేసిన మా మంచు శిఖ‌రమా..మీకు ధ‌న్య‌వాద‌ములు ఎలా తెలపాలి. దైవ సంక‌ల్ప‌మో, యాదృచ్చిక‌మో తెలీదు కానీ మంచు కురిసే మాసం న‌వంబ‌ర్ మాసం మా మంచు న‌ట‌రాజు చ‌ల్ల‌టి వెన్నెల‌ను ప్రారంభించిన మాసం న‌వంబ‌ర్ మాసం కావ‌డం మాకు మ‌రింత ఆనంద‌దాయకం. మీ న‌ట‌నా విశ్వ‌రూపం మ‌రిన్ని వ‌సంతాలు దేవిప్య‌మానంగా వెలుగొందుతూ మ‌మ్మ‌ల్ని మైమ‌రింప చేయాల‌ని మీరు నిత్యం కొలిచే ఆ సాయినాథ్ మ‌హారాజ్ దీవెన‌లు మెండుగా ఉండాల‌ని కోరుకుంటూ...