‘టీటీడీ’ చైర్మన్ పదవిపై మోహన్ బాబు క్లారిటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మంచు మోహన్‌బాబు ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరినప్పుడే పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయనకు జగన్.. ఏ పదవి ఇస్తారు..? అనే చర్చ నడుస్తుండగా.. టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తారని పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఆయన విద్యానికేతన్ సంస్థలు కూడా తిరుపతిలోనే ఉండటంతో.. కచ్చితంగా ఈయన్నే చైర్మన్ పదవి వరిస్తుందని వార్తలు వినవచ్చాయి.
అంతేకాదు.. మొదట వైఎస్ జగన్ బాబాయ్.. వైవీ సుబ్బారెడ్డికి ఈ చైర్మన్ పదవి కట్టబెడతారని పుకార్లు రాగా కొన్ని గంటల క్రితమే రాజ్యసభకు పంపాలని సీఎం ఫిక్స్ అయ్యారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇక ఆ చైర్మన్ పదవి పక్కాగా మోహన్‌బాబునే వరిస్తుందని భావించారు. ఈ క్రమంలో తన ట్విట్టర్ ద్వారా మోహన్‌బాబు రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరేటప్పుడు తాను ఏ పదవులూ ఆశించి రాజకీయాల్లోకి రాలేదని తేల్చిచెప్పారు.
ఆ నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చా..
" నేను టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొందరు ఫోన్లు కూడా చేసి మరీ అడుగుతున్నారు. నా ఆశయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటమే. అందుకోసమే నా వంతుగా నేను పార్టీ కోసం కష్టపడ్డాను. వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకంతోనే నేను తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించాను. అంతేగానీ నేను ఎలాంటి పదవులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్లను దయచేసి ప్రోత్సహించవద్దు" అని మీడియాను మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, మంచు అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. అయినా మీకు చైర్మన్ పదవి ఇస్తారని మేమేం అనుకోవట్లేదులేండి సారూ.. అంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout