సందేశాత్మక చిత్రాన్ని అనౌన్స్ చేసిన మోహన్‌బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ డా. మోహన్‌భాబు 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని తన కొత్త సినిమా వివరాలను ప్రకటించారు. ‘సన్నాఫ్ ఇండియా’ అనే టైటిల్‌ను ప్రకటించిన మోహన్‌బాబు సదరు సినిమా టైటిల్ పోస్టర్‌ను, తన లుక్‌ను విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తూ వస్తున్న మోహన్‌బాబు తన సొంత బ్యానర్స్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై ఈ సినిమాను చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి సినిమా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందనే విషయాలను ప్రకటించలేదు. కరోనా వైరస్ ప్రభావం బాగా తగ్గిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
560కు పైగా సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మోహన్‌బాబు మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిర్మాతగా కూడా 50 చిత్రాలను నిర్మించారు. కొంతకాలంగా ఆయనకు ఎగ్జయిట్‌మెంట్‌గా అనిపించిన స్క్రిప్ట్స్‌కే ఓకే చెబుతున్నారు. లేటెస్ట్గా సూర్య హీరోగా సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com