'మామ మంచు.. అల్లుడు కంచు'
Send us your feedback to audioarticles@vaarta.com
డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం 'అల్లరి మొగుడు'. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్ ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వాటిలో 'అల్లరి మొగుడు'కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్ జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తు చేయడానికి కారణం ఉంది.
మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది. 23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ చేయబోతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్ కి 'అల్లరి' నరేశ్ తోడయ్యారు. నరేశ్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. సినిమా పేరు 'మామ మంచు... అల్లుడు కంచు'. టైటిల్ రోల్స్ లో మోహన్ బాబు, 'అల్లరి' నరేశ్ నటించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై వరుసగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్న మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మధ్యకాలంలో సినిమాకి కీలకంగా నిలిచే పాత్రలు చేసిన మోహన్ బాబు ఫుల్ ప్లెడ్లెడ్జ్ హీరోగా చేయబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి అచ్చు, బప్పా లహరి, రఘు కుంచె పాటలు స్వరపరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యింది.
అలీ, రఘుబాబు, రాజా రవీంద్ర, కృష్ణభగవాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సిపాన, కెమెరాః బాల మురుగన్, ఆర్ట్ః చిన్నా, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి, నిర్మాత: మంచు విష్ణు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com