మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకలో విశేషాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.
మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న కలకాలం గుర్తుండి పోయేలా భారీ సెట్ వేసి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మొదటిది మోహన్ బాబు సినిమాల్లోని బెస్ట్ 60 సాంగ్స్ ఉన్న సీడీని విడుదల చేయడం. రెండవది మోహన్ బాబు ప్రాణ స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుమాట రాసిన `బెస్ట్ సీన్స్ ఆఫ్ పెదరాయుడు` పుస్తకాన్ని విడుదల చేస్తారు. చివరిగా మోహన్ బాబు వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోతో కూడిన బుక్ ను విడుదల చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments