Asia Cup 2023 : శివాలెత్తిన సిరాజ్.. పేకమేడలా శ్రీలంక టాప్ ఆర్డర్, 8వసారి ఆసియా ఛాంపియన్‌గా భారత్

  • IndiaGlitz, [Monday,September 18 2023]

శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుని ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో లంకేయులపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఎనిమిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) ధాటికి శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 27), ఇషాన్ కిషన్ (23) లు 6.1 ఓవర్లలోనే ఆడుతు పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు శ్రీలంకకు ఆదిలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. తొలి ఓవర్‌లోనే కుశాల్ పెరీరాను బుమ్రా ఔట్ చేశాడు. అక్కడి నుంచి సిరాజ్ దాడి మొదలైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. లంక బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ, డాసున్ శనక, పతిరనలు ఇలా వచ్చి అలా వెళ్లారు. మిగిలిన వారిలో నిశాంక (2), ధనుంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8), దుషాన్ హేమంత (13) పరుగులు చేశారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ 6, పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.

ఇకపోతే.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ఆసియా కప్ సొంతం చేసుకుంది. గతంలో 2018లో టీమిండియా ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. అటు వన్డే ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు (50) సాధించిన జట్టుగా లంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్.. భారత్ తరపున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) వున్నారు.

More News

Pawan Kalyan:టీడీపీ - జనసేన పొత్తు : సమన్వయ కమిటీ నియమించిన పవన్..  నాదెండ్ల మనోహర్‌కు పగ్గాలు

ఇదిలావుండగా శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss 7 Telugu : సెకండ్ హౌస్‌మేట్‌గా శివాజీ .. రూల్స్‌ ప్రకారం ఆడాలన్న నాగ్, కంటెస్టెంట్స్‌కి రేటింగ్

చూస్తూ వుండగానే బిగ్‌బాస్ 7 తెలుగు సెకండ్ వీకెండ్‌కు వచ్చేసింది. ఉల్టా పల్టా అంటూ సీజన్‌ను రక్తి కట్టించేందుకు బిగ్‌బాస్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Game Changer:రామ్‌చరణ్ ‘‘ గేమ్ ఛేంజర్ ’’ ఆడియో సాంగ్ లీక్ .. షాకైన చిత్ర యూనిట్, దిల్‌రాజు యాక్షన్

ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువైంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా లోకేషన్‌ ఫోటోలు,

Prema Vimanam:అక్టోబర్ 13న ‘జీ5’లో ‘ప్రేమ విమానం’

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’

Tirumala:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన తిరుమల.. రేపే అంకురార్పణ, 18న పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.