Asia Cup 2023 : శివాలెత్తిన సిరాజ్.. పేకమేడలా శ్రీలంక టాప్ ఆర్డర్, 8వసారి ఆసియా ఛాంపియన్‌గా భారత్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుని ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో లంకేయులపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఎనిమిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) ధాటికి శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 27), ఇషాన్ కిషన్ (23) లు 6.1 ఓవర్లలోనే ఆడుతు పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు శ్రీలంకకు ఆదిలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. తొలి ఓవర్‌లోనే కుశాల్ పెరీరాను బుమ్రా ఔట్ చేశాడు. అక్కడి నుంచి సిరాజ్ దాడి మొదలైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. లంక బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ, డాసున్ శనక, పతిరనలు ఇలా వచ్చి అలా వెళ్లారు. మిగిలిన వారిలో నిశాంక (2), ధనుంజయ డిసిల్వా (4), దునిత్ వెల్లలాగె (8), దుషాన్ హేమంత (13) పరుగులు చేశారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో కుశాల్ మెండిస్ (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ 6, పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
ఇకపోతే.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ఆసియా కప్ సొంతం చేసుకుంది. గతంలో 2018లో టీమిండియా ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. అటు వన్డే ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు (50) సాధించిన జట్టుగా లంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్.. భారత్ తరపున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com