Mogalirekulu actor Sagar:జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' నటుడు సాగర్
Send us your feedback to audioarticles@vaarta.com
చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌తో ఫేమస్ అయిన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. గోదావరిఖని రామగుండం ప్రాంతానికి చెందిన సాగర్.. పార్టీలో చేరడంతో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయబోతున్నారా..? అనే సందేహం నెలకుంది. మరి దీనిపై క్లారిటీ రావాలి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్‌తో సాగర్ భేటీ అయ్యారు. అప్పుడే ఆయన జనసేనలో జాయిన్ అవుతున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇక సాగర్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సుందర్ రావు, ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగాబాబు కూడా జనసేన పార్టీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ని పవన్ ప్రకటించారు. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు కూకట్‌పల్లి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇక ఎట్టకేలకు బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసే సీట్ల లెక్క ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 11 సీట్లు కావాలని జనసేన పట్టుబడగా.. పలు దఫాల చర్చల తర్వాత 9 స్థానాలకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితో పాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీకి రెడీ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్, కోదాడ స్థానాలు జనసేనకు కేటాయించారని చెబుతున్నారు. అయితే తాండూరు, శేరిలింగంపల్లి స్థానాల కోసం జనసేన పట్టుబడుతుండగా.. ఆ రెండు స్థానాలు తమకు వదిలేయాలని బీజేపీ కోరుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com