లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైన్యంలో ధైర్యాన్ని నింపేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లి సైనికులతో మాట్లాడి.. ధైర్యం నింపగా.. నేడు ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మికంగా పర్యటించారు. ఆయన వెంట నరవణేతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. లద్దాఖ్‌లోని నీములో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ చెందిన సీనియర్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ సరిహద్దులోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు. అలాగే జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్‌లో చికిత్స పొందుతున్న సైనికులను మోదీ పరామర్శించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments