రాహుల్ ఓడిపోతే రాజకీయాల్లో ఉండను.. మోదీకి ఓటమే!
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోతారని.. ఓడించి తీరుతామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలకు మాజీ క్రికెటర్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తానని సిద్ధూ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధూ మాట్లాడుతూ.. యువరాజు ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు దూరమవుతానన్నారు. విశ్వాసంతో పనిచేసేవారే జాతీయవాదులు అవుతారని ఈ సందర్భంగా సిద్ధూ ఎద్దేవా చేశారు. జాతీయవాదం అంటే ఏమిటో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటమికి రఫేల్ వివాదం ప్రధాన కారణం అవుతుందన్నారు.
కాగా.. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ కాంగ్రెస్ కంచుకోట అన్న సంగతి తెలిసిందే. అమేథీ నుంచి బీజేపీ తరఫున మరోసారి స్మృతీ ఇరానీ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో ఈమె రాహుల్ చేతిలో ఓడిన విషయం విదితమే. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే యూపీఏ తరఫున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 150 ఎంపీ సీట్లకు పైగా కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ అభ్యర్థిగా నిలుస్తారు లేకుంటే కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments