మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. విరాళాలు కోరిన హ్యాకర్లు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విటర్ వెల్లడించింది. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. అలాగే ప్రధాని అకౌంటును కూడా పునరుద్ధరించినట్టు ట్విటర్ వెల్లడించింది. హ్యాకర్ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. అయితే హ్యాకర్ వెంటనే ఆ ట్వీట్‌లను డిలీట్ చేశారు. మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది.

‘‘కోవిడ్ 19 కట్టడికి పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు విరాళమివ్వాలని మీ అందరినీ కోరుతున్నా. ఇండియాలో క్రిప్టో కరెన్సీ తిరిగి చలామణిలోకి వచ్చింది కాబట్టి మీ విరాళాలను దయచేసి పంపాలని కోరుతున్నా’’ అని హ్యాకర్లు ట్వీట్ చేశారు. దీనిపై ట్విటర్ స్పందించింది. ‘దీనిపై మాకు సమాచారం అందింది. తిరిగి అకౌంటును పునరుద్ధరించాం. దీనిపై వెంటనే విచారణ సైతం చేపట్టాం’ అని తెలిపింది. కాగా.. మోదీ ట్విటర్ అకౌంట్‌ జాన్ విక్ అనే గ్రూప్ పేరుతో హ్యాక్ అయ్యింది.

ఈ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీలో హస్తముందనే ఆరోపణలున్నాయి. పేటీఎంకు చెందిన ఈ-కామర్స్ కంపెనీయే.. పేటీఎం మాల్ యూనిఫార్మ్. కాగా మోదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ ట్విటర్ ద్వారానే వెల్లడిస్తూ ఉంటారు. మోదీ తన ట్విటర్ అకౌంట్‌ను 2011లో క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌ను ప్రస్తుతం 25 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. కాగా ఈ అకౌంట్ నుంచి ఇప్పటి వరకూ 37000 ట్వీట్లు మోదీ చేవారు.

More News

7 నుంచి మెట్రో ప్రారంభం.. ట్రైన్ ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణలో మెట్రో రైలు సర్వీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. తొలిసారిగా..

భారత్‌లో నిన్న కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించింది.

తెలంగాణలో కొత్తగా 2817 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

అభిమానుల‌కు అండ‌గా నిలిచిన వారికి ప‌వ‌న్ థాంక్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం, శాంతిపురం మండ‌లంలో, ప‌వ‌న్ క‌టౌట్ క‌డుతున్న అభిమానుల‌కు విద్యుత్ ఘాతం  త‌గిలింది.