ప్రధాని మోదీ వదిన కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ చిన్న అన్నయ్య.. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి (55) (మోదీ వదిన) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. కాగా ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని భగవతి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments