ప్రధాని మోదీ వదిన కన్నుమూత

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ చిన్న అన్నయ్య.. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి (55) (మోదీ వదిన) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. కాగా ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని భగవతి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

More News

'ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ బాబాయ్ ఇతనే..!

టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీలో ‘కోత’

ప్రభుత్వం బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. మే-01 నుంచి కొత్త వడ్డీ రేట్ల విధానం అమల్లోకి తెచ్చింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వ్యవహారం: ఆర్జీవీకి చంద్రబాబు పంచ్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మే-01న ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.

మావోల రివెంజ్..15 మంది కమాండోలు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం మూడు డజన్ల వాహనాల్ని తగలబెట్టారు.

'మే' డే వేడుకల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్...

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రం అట్టుడికిన సంగతి తెలిసిందే. బోర్డు తప్పిదాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.