మోదీ సంచలన నిర్ణయం.. బంగారం లెక్కలు చెప్పాల్సిందే!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. నల్ల ధనాన్ని బంగారం రూపంలో దాచిపెట్టిన వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన కేంద్రం.. పరిమితికి మించిన బంగారం కలిగివున్న వారిని లక్ష్యం చేసుకొని, నిర్ణీత కాలపరిమితికి లోబడి ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే రహస్యంగా దాచుకున్న బంగారం లెక్కలు చెప్పేందుకు ప్రజలకు వెసలుబాటు కల్పిస్తోందన్న మాట.
ఇక అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను విధించాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ, ప్రధాని కార్యాలయం విధివిధానాలను ఖరారు చేస్తోంది. అంతేకాదు సులభంగా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇకపై పరిమితికి మించి బంగారం ఉంటే వివరాలు చెప్పాల్సిందే. మొత్తానికి చూస్తే అక్రమ బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout