ప్రధాని మోడీ సంచలన నిర్ణయం.. కరోనా వ్యాక్సిన్ ఇక ఉచితం!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ దేశంలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 నుంచి కరోనా వ్యాక్సిన్ ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. మోడీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఈ కీలక ప్రకటన చేశారు.
ఇదీ చదవండి: 'పీవీ నరసింహారావు' పేరుతో కొత్త జిల్లా.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్?
గత వందేళ్లలో ఎన్నడూ చూడని మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది అని ప్రధాని అన్నారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్ళు పైబడిన వారికి ఉచితంగా కరోనా టీకా అందించనున్నట్లు మోడీ తెలిపారు. వేగంగా టీకాలు ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తాం అని ప్రధాని అన్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల 7 కంపెనీలు టీకా తయారు చేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు ట్రయల్ దశలో ఉన్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. టీకా పంపిణీలో రాష్ట్రాల అభిప్రాయాలని కేంద్రం పరిగణలోకి తీసుకుంది అని అన్నారు. ఇప్పటికే 23 కోట్ల టీకాల ఉత్పత్తి జరిగింది. చిన్నారులకు ప్రత్యేక టీకా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు మోడీ అన్నారు.
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎందరో తమ తమ ఆప్తులని కోల్పోయారు. ప్రపంచ దేశాలు కఠిన పరిస్థితులని ఎదుర్కొంటున్నాయి అని మోడీ అన్నారు. కరోనాకు ముగింపు ఎప్పుడో అర్థం కాని పరిస్థితిలో ప్రపంచ మెడికల్ విభాగం ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్స్ పైనే అన్ని దేశాలు అసలు పెట్టుకున్నాయి. ఈతరుణంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout