చిరు, నాగ్‌లకు మోదీ ప్రశంస...
- IndiaGlitz, [Saturday,April 04 2020]
కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆలోపు ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన పెంచడానికి సినీ ప్రముఖులందరూ ముందుకు వచ్చారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు వీడియోల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. రీసెంట్గా కోటి సంగీతం అందించిన ఓ పాటలో చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్‌లు నటించారు. ఈ పాటకు మంచి స్పంద వచ్చింది.
దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్‌లను అభినందించారు. ‘‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు.
థాంక్స్ చెప్పిన చిరు..
మోదీ ట్వీట్‌కు చిరంజీవి ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పారు. కరోనా క్రైసిస్‌లో పడకుండా దేశాన్ని కాపాడుతున్నందుకు ఆయననకు అభినందనలు చెప్పిన చిరు .. తమకు వీలైనంత సాయాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
— Narendra Modi (@narendramodi) April 3, 2020
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD