మోదీ మేనియాతో దుమ్ములేపిన స్టాక్ మార్కెట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా నమో మోదీ నామ స్మరణ గట్టిగా వినిపిస్తోంది. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు తేల్చడంతో సెన్సెక్స్ తారాజువ్వలా ఎగసిపడి అతిభారీ లాభాలతో ముగిసిశాయి. దలాల్ స్ట్రీట్‌నూ మోదీ మేనియా తాకిందని చెప్పుకోవచ్చు. కనీవినీ ఎరుగని రీతిలో ఆకాశమే హద్దుగా సెన్సెక్స్, నిఫ్టీ దూసుకువెళ్లాయి. వీటన్నింటికీ కారణం కేవలం వన్ అండ్ ఓన్లీ ఎగ్జిట్ పోల్స్.
సెన్సెక్స్ లాభం 1,422 పాయింట్ల లాభంతో 39,352 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 421 పాయింట్ల లాభంతో 11,828 పాయింట్లతో ముగిసింది. కేవలం ఒకే ఒక్క నిమిషంలో 3.25 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద పెరిగిపోయింది. కాగా.. అదానీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 17 శాతం మేర పరుగులు పెట్టాయి. మరోవైపు ఎస్‌బీఐ 8శాతం, యస్‌బ్యాంక్ 6శాతం, సెన్సెక్స్‌లోని , ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్,ఇండస్‌ఇండ్ బ్యాంక్ తదితర షేర్లు భారీగా లాభపడ్డాయి.
దీంతో.. రూపాయి విలువ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరి.. 69.36 మార్కును తాకింది. కాగా.. శుక్రవారం రోజు రూ.70.23 వద్ద ముగిసిన విషయం విదితమే. స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఒక రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ 5.33 లక్షల కోట్ల మేర పెరిగడం విశేషమని చెప్పుకోవచ్చు. మే-23 తర్వాత వెలువడనున్న ఫలితాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తే.. గనుక 300 మార్కును దాటితే ఇదే హవా కొనసాగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో.. పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్డీఏ వస్తుందో.. యూపీఏ వస్తుందో తేలాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com