మే-03 తర్వాత మోదీ, కేసీఆర్ వ్యూహం ఇదేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఇప్పటికే కొన్ని సడలింపులు ఇవ్వగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం అస్సలు సడలింపులు ఇవ్వలేదు. అయితే కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ మరింత కఠినంగా చేస్తున్నాయి. మే-03 దగ్గరపడుతోంది. ఆ తర్వాత అసలు మోదీ ఏం చేయబోతున్నారు..? మోదీ మనసులో ఏముంది..? మళ్లీ లాక్ డౌన్ ఏమైనా పొడిగిస్తారా..? ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేస్తే ఇంకా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారా..? అనే విషయాలపై ఇంతవరకూ కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ.. కొన్ని షరతులతో కూడిన జీవనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు లీకులు వదులుతున్నాయి.
ఇలా చేయబోతున్నారా..!?
- విమానాలు, రైళ్లు, బస్సు సేవలు మే-03 తర్వాత కూడా కష్టమే అని తెలుస్తోంది. అయితే గ్రీన్ జోన్లో ఉండే ప్రాంతాలకు మాత్రమే రవాణా సౌకర్యం ఉంటుందని సమాచారం.
- మే-03 తర్వాత కూడా కంపల్సరీగా మాస్క్లు ధరించాల్సిందే.. లేకుంటే ఫైన్ వేసే అవకాశాలు ఎక్కువ.
- సోషల్ డిస్టెన్స్ కూడా కేంద్రం కంపల్సరీ చేయనుంది.
- పెళ్లిళ్లు, ఫంక్షన్స్, మత సమ్మేళనాలపై ఆంక్షలు ఉంటాయ్
- నిత్యావసర దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించాల్సిందే
- ముంబై, ఢిల్లీ, నోయిడా, ఇండోర్పై మే-03 తర్వాత కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టనుంది
- కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడానికి ఆర్మీ కూడా రంగంలోకి దిగుతుందని సమాచారం.
కేసీఆర్ ఏం చేయబోతున్నారు!?
ఇదిలా ఉంటే కేంద్రం చెప్పిన సడలింపులను మాత్రం రాష్ట్రాలు అస్సలు పట్టించుకోలేదు. స్వతాహాగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ ప్రాంతాల్లో మే చివరిదాకా లాక్డౌన్ పొడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ విషయానికొస్తే ఇప్పటికే మే-07 వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగింది. అవసరమైతే మే చివరి వరకూ పొడిగించే యోచనలో సీఎం కేసీఆర్ తెలుస్తోంది. మరి మే-05న కేసీఆర్ నిర్ణయాన్ని మీడియా ముఖంగా చెప్పేయనున్నారు. ఎందుకంటే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయ్.. ఈ తరుణంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తూచి తీసుకోవాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com