జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 8 గంటలకు మాట్లాడిన ఆయన.. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ‘ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోంది. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది. ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోంది. భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయి. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చింది’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.
బతకాలి.. బతికించుకుంటూ..!
నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారు. అలా ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నాం.. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గం. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చింది.. బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం. మరింత ధృడ సంకల్పంతో మనం ముందుకెళ్లాలి. రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌ల తయారీ మొదలైంది. ప్రాణాలను కాపాడుకుంటూనే ముందుకెళ్లాలి’ అని మోదీ వ్యాఖ్యానించారు.
వెనకడుగేయడం సరికాదు..
‘అభివృద్ధి వైపు భారత్ విజయవంతంగా అడుగులేస్తోంది. కరోనాపై పోరాటాలు నాలుగు నెలలు గడిచాయి. దేశంలో అనేక మంది తమ వారిని కోల్పోయారు. ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పదిగా ఉండాలి. వైరస్ ప్రభావం మొదలైనప్పుడు ఏ దేశంలో ఒక పీపీఈ కిట్ లేదు. ప్రతిరోజు రెండు లక్షల పీపీఈ కిట్లు తయారుచేస్తున్నాం. ప్రపంచంలో ఆత్మ విశ్వాసం నిర్వచనంగా మారిపోయింది. యుద్ధంలో ఓడిపోవడం.. వెనకడుగు వేయడం సరికాదు. ఈ విపత్తు కన్నా మన సంకల్పం గొప్పదిగా ఉండాలి. ఈ ప్రమాదం భారత్‌కు ఒక సందేశాన్ని తీసుకొచ్చింది. దేశం ఐదు పిల్లర్లపై నిలబడి ఉంది. ప్రపంచంలో జీవన్మరణ పోరాటం సాగుతోంది. ప్రపంచమంతా ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధం చేస్తోంది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments