డేర్ అండ్ డ్యాషింగ్ మోడీ.. సర్జికల్స్ స్ట్రైక్స్‌తో సత్తా చాటాడు!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో హీరో ఏ రేంజ్లో డేర్ చేసి ఫైట్స్ చేస్తాడో అందరం చూసే ఉంటాము.. అయితే రియల్ లైఫ్‌లో అవన్నీ జరగవ్.. అలా చేయాలన్నా ఆలోచనలు కూడా రావ్. 'అనుకుంటే కానిది ఏమున్నది...' అంటూ 'నేనున్నాను'.. ఏదైనా సరే చేసి తీరుతాను.. ఇండియా కోసం ఏదైనా సరే చేస్తాను అంటూ 'ఒకే ఒక్కడు' 2014 ఎన్నికల తర్వాత వచ్చేశారు. ఆయన ఇంకెవరో కాదండోయ్ మన ప్రధాని నరేంద్ర మోదీ. నాటి నుంచి నేటి వరకు ఆయన చేసిన పనులు, సంస్కరణలు ఇక్కడ అప్రస్తుతం. అయితే మన ప్రత్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తా 'ఇదేరా భారత్'.. 'ఇండియా సత్తా ఇదీ' అని రుచి చూపిస్తున్నారు.
ముఖ్యంగా పాక్‌లాంటి శత్రుదేశానికి గొడవలొద్దు.. గొడవలవల్ల ఫలితమేమీ ఉండదు అని పదేపదే హెచ్చరించినప్పటికీ ఉగ్రమూకలను అడ్డుపెట్టుకుని రోజూ కవ్విస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం జమ్ముకశ్వీర్లోని పుల్వామాలో ఉగ్రమూకలు రెచ్చిపోయి 40 మంది సైన్యాన్ని పొట్టనపెట్టుకున్నాయి. అయితే నాటి నుంచి తీవ్ర ఆగ్రహంతో.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇండియన్ ఆర్మీ మన దెబ్బేంటో రుచిచూపించాలని అవకాశం కోసం వేచి చూసింది. అయితే అప్పటికే ప్రధాని మోదీ.. సైన్యానికి స్వే్చ్ఛ ఇచ్చేశారు. దీంతో పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లిన ఇండియన్ ఆర్మీ, భారత్ వాయుసైన్యం ప్రతీకారం తీర్చుకుంది. కాగా మోదీ ఇలా డేర్ అండ్ డ్యాషింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు..? ఇంతకమునుపు దేశాన్ని ఏలిన ప్రధానులు ఏయే నిర్ణయాలు తీసుకున్నారు..? ఎవరి హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయ్ అనే విషయాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
పోక్రాన్ ఘటన..(1998)
1998లోనే మొదటిసారి పోక్రాన్ పేరుతో అణుపరీక్షలు నిర్వహించిన దివంగత ప్రధాని వాజ్‌పేయి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు. అయితే 24 ఏళ్ల తర్వాత వాజపేయి హయాంలో రాజస్థాన్‌లోని పోక్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను భారత్ నిర్వహించింది. పలు దేశాలు సమర్థించాయి. 1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్‌తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్య చర్యలు ప్రారంభించారు. లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'పరమాణు - ది స్టోరీ ఆఫ్ పోక్రాన్'.
కార్గిల్ యుద్ధం..(1999)
1999లో వాస్తవాధీన రేఖ(ఎల్.ఒ.సి) దాటి భారత్‌పై పాకిస్తాన్ సైన్యం దాడి చేయడంతో కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న కవ్వింపు చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తోంది.
వాజపేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్.. పాక్‌పై గెలిచింది. కార్గిల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో 1999 మేలో మొదలై జూలై 26న ముగిసింది. అందుకే మనదేశం జులై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటుంది. రెండు నెలలు వీరోచితంగా సాగింది ఈ యుద్ధం. కార్గిల్ వార్ యుద్ధ నాయకులుగా అప్పటి మన దేశ ప్రధాని అటల్ బిహారి వాజపేయి మరియు అప్పటి ఆర్మీ చీఫ్ వేద్ ప్రకాష్ మాలిక్‌ను పరిగణిస్తారు.
కాగా.. ఈ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ పేరుతో కార్గిల్ వార్‌లో పాకిస్తానీ సైనికులను మరియు కాశ్మీర్ మిలిటంట్లను మన సైన్యం మట్టుపెట్టింది. మన దేశ వాయుసేన అద్భుత ప్రదర్శన కనబరిచింది. మేఘాల మధ్య నుండి మనదేశ పైలట్లు శత్రుదేశ సైనికుల మీద దాడి చేసారు. ఇదంతా మన పైలట్లు మరియు ఇంజినీర్లు ఒక వారం శిక్షణతో చేయడం గమనార్హం.
2016 ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్..
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరిగిన దాడులివి. 2016 సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రైక్‌కు సరిగ్గా 11 రోజుల ముందు యూరీలో భారత సైనిక స్థావరంపై దాడి జరిపిన ఉగ్రవాదులు 19 మంది సైనికుల్ని బలితీసుకుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 29న భారత సైన్యం ఎల్ఓసీ సమీపంలోని పూంఛ్, కుప్వారాలో సర్జికల్ స్ట్రైక్ జరిపింది. అయితే మంగళవారం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం పాకిస్తాన్ భూభాగానికి అత్యంత సమీపంలోనివి. ఈ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 40-50 మంది ఉంటారని అప్పటో అంచనా వేయడం జరిగింది. 1971 యుద్ధం తర్వాత భారతీయ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎల్ఓసీ దాటలేదు.
2019 సెకండ్ సర్జికల్ స్ట్రైక్స్..
కాగా రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ ప్రధాని మోదీ హయాంలోనే జరగడం విశేషం. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకారంగా సెకండ్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రమూకలకు సంబంధించిన మూడు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. జైష్-ఏ-మహ్మద్ శిబిరాలపై ప్రయోగించిన బాంబులు పరిమాణం చాలా ఎక్కువ అని తెలుస్తోంది. సుమారు 1,000 కిలోల లేజర్-గైడెడ్ బాంబుల్ని జైష్-ఏ-మహ్మద్ శిబిరాలపై ప్రయోగించింది. ఈ దాడుల్లో సుమారు 200-300 మందికిపైగానే చనిపోయారని అంచనా. అయితే దీనిపై ఎలాంటి సమాచారం రానప్పటికీ మంగళవారం 11గంటల ప్రాంతంలో మీడియా మీట్ నిర్వహించిన వీదేశాంగ ప్రధాన కార్యదర్శి గోఖలే.. ఎస్ సర్జికల్ స్ట్రైక్స్-02 నిజమేనని తేల్చిచెప్పారు.
మొత్తానికి చూస్తే.. వాజ్‌పేయి హయాం తర్వాత ఈ రేంజ్లో ప్రత్యర్థులను మట్టుబెట్టిన ఘనత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధాని నరేంద్ర మోదీదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక వేళ ఆయన స్థానంలో మరో ప్రధాని ఉంటే కూడా బహుశా ఇలానే చేసుండేవారేమో. అయితే మోదీది మాత్రం డేర్ స్టెప్ వేశారని చెప్పుకోవచ్చు. అందులోను రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేయడమంటే ఆషామాషీ విషయం అస్సలేకాదు. మోదీ డేరింగ్ స్టెప్స్‌కు హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి. ముఖ్యంగా పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు అమరులైతే సుమారు 400 మంది ఉగ్రవాదులను చంపి భారత సైన్యం బదులు తీర్చుకుందంటే అస్సలు ఇది ఊహించని విషయమనేని చెప్పుకోవచ్చు. అంతేకాదు గతంలో లాగా ఒక చెంపపై కొడితే తిరిగి మరో చెంప చూపించే రకం భారత్‌ది కాదు.. ఎదుటి వాడి చెంప పగలగొట్టడమే అంటూ ఇండియన్ ఆర్మీ నిరూపించిందంటూ పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com