'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే రోజుకు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయ్. ఇలాంటి తరుణంలో కచ్చితంగా 4.0 లాక్డౌన్ విధించాల్సిందేనని కేంద్రం ఫిక్స్ అయ్యింది. ఇవాళ జాతినుద్ధేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో కచ్చితంగా లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని.. అయితే దానిపై మే-18లోగా నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. అంటే.. దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా 4.0 ఉంటుందన్న మాట. రాష్ట్రాల సూచనలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పారన్న మాట. అంతేకాదు.. లాక్డౌన్ కొనసాగిస్తే మాత్రం కొత్త నిబంధనలతో ఇప్పటికి భిన్నంగా అమలవుతుందని చెప్పడం గమనార్హం. పొడిగింపు ఉంటుందని ఇప్పుడు డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ లాక్డౌన్ 4.0 అమలు తప్పదని పరోక్షంగా ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయ్. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగిస్తేనే ఇన్నిరోజులు డాక్లర్లు, పారిశుద్ధ్యకార్మికులు, పోలీసులు చేసిన పోరాటానికి విలువ ఉంటుందని లేకుంటే దానికి అర్థమే లేకుండా పోతుందని.. వారి పోరాటం వృథా అవుతుందని వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు.
కీలక దశలో ఉన్నాం..
‘కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాలి. కరోనా ఇప్పుడప్పుడే మానవాళిని విడిచి వెళ్లే అవకాశం లేదని అనేకమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిని గుర్తు పెట్టుకుంటూనే ఈ సంకట సమయంలో ప్రజలంతా ముందుకు సాగాలి. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోంది. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది. ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోంది. భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయి. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చింది. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నాం.. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గం. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చింది.. బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం. మరింత ధృడ సంకల్పంతో మనం ముందుకెళ్లాలి. ఈ ప్రమాదం భారత్కు ఒక సందేశాన్ని తీసుకొచ్చింది’ అని ప్రధాని మోదీ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout