లోక్‌సభ వేదికగా ‘అయోధ్య’పై మోదీ కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్య రామమందిరం నిర్మాణంపై పార్లమెంటు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇన్ని రోజులుగా ఈ వ్యవహారంపై మోదీ మాట్లాడుతూ.. రామమందిరం నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. ఆ ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. ఆ ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్న విషయాన్ని లోక్‌సభలో మోదీ తెలిపారు. అయోధ్యలో మందిరం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను ఆయన కోరారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు.
దళితుడికి చోటిచ్చాం!
అయోధ్యపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టులో ఓ దళితుడికి కూడా స్థానం కల్పించనన్నామని తెలిపారు. కాగా.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ఆలయ ట్రస్టుకు ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
అంతకు ముందు ఏం జరిగింది!?
కాగా.. దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య కేసు వివాదానికి నవంబర్-09/2019 నాడు సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు దశబ్దాల కేసును కేవలం గంట వ్యవధిలోనే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చి.. వివాదాస్పద భూమి రాముడి ఆలయానికే చెందుతుందని.. రామజన్మ న్యాస్‌కే అప్పగించడం జరిగింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తీర్పునిచ్చింది. నిజంగా ఈ తీర్పును హిందువులకు ఓ శుభవార్త.. ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోవాల్సిన రోజని చెప్పుకోవచ్చు. ఈ తీర్పును విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు.. ఈ తీర్పునిచ్చిన సీజేఐ రంజన్ గొగోయ్ చరిత్రలో నిలిచిపోతారు కూడా.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout