అయోధ్య తీర్పుపై మోదీ, షా రియాక్షన్ ఇదీ...
- IndiaGlitz, [Saturday,November 09 2019]
దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య కేసుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును దేశ వ్యాప్తంగా ఉండే హిందూ సంఘాలు, రాజకీయ నేతలు సాదరంగా స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. పంజాబ్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ తీర్పుపై స్పందించారు.
మోదీ రియాక్షన్...
‘అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఎవరి విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామభక్తి అయినా, రహీమ్ భక్తి అయినా మనమందరం దేశభక్తి స్ఫూర్తిని బలోపేతం చేసే సమయం ఇది. శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు.
షా రియాక్షన్ ఇదీ..
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అన్ని మతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని సులువుగా అంగీకరించాలి. శాంతి, సామరస్యంతో నిండిన 'ఏక్ భారత్-శ్రేష్ట భారత్' అనే ప్రతిజ్ఞకు అందరూ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
కాగా.. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఇందుకు ప్రత్యామ్నాయంగా ముస్లీంలకు ఐదెకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే.