జనాభా లెక్కలకోసం ఇక మొబైల్ యాప్!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. జనాభా లెక్కల కోసం ఇన్ని రోజులూ ఇంటింటికి వచ్చి లెక్కలేసుకుని మరీ రాసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై ఇలాంటివన్నీ ఏమీ ఉండకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2021 నుంచి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
సోమవారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు ప్రకటించారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్కు ఇదొక పరివర్తన అని ఆయన చెప్పుకొచ్చారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు గత మార్చిలోనే కేంద్రం ప్రకటించిన విషయం విదితమే.
కాగా ఈ ప్రక్రియ హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభంకానున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout